Devotional

Horoscope in Telugu – Sep 08 2024

Horoscope in Telugu – Sep 08 2024

మేషం
అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ ఆలోచనలతో అందరిని ఆకర్షిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

వృషభం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంటుంది. శివాష్టకం చదివితే మంచి ఫలితాలు అందుకుంటారు.

మిథునం
సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కీలకమైన విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివారాధన మంచిది.

కర్కాటకం
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు ఒత్తిడిని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

సింహం
కుటుంబసభ్యులతో కలిసి చేసే పనులు మంచి చేస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

కన్య
శుభ ఫలితాలున్నాయి. బంధువుల సహకారం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.

తుల
జన్మచంద్ర స్థితి అనుకూలంగా ఉంది. మొదలుపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. కొన్ని పరిస్థితులు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. లింగాష్టకం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వృశ్చికం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంటుంది. చంద్రధ్యానం మంచిది.

ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.

మకరం
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

కుంభం
కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

మీనం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎవరితోనూ గొడవలకు వెళ్లొద్దు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z