NRI-NRT

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవాస భక్తురాలు మృతి-CrimeNews-Sep 07 2024

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవాస భక్తురాలు మృతి-CrimeNews-Sep 07 2024

* విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగం ఇచ్చేందుకు వెళ్లిన ఓ ఆధ్యాత్మిక వక్త చిక్కుల్లో పడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో అంగవైకల్యంపై చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఈ ఘటన చెన్నై (Chennai)లో చోటు చేసుకొంది. ఎన్‌జీవో పరంపోరుల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మహా విష్ణు (Maha Vishnu) ఆధ్యాత్మిక విషయాల ఉపన్యాసకుడిగా పేరొందారు. తమ విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా ప్రసంగం ఇవ్వాలంటూ ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ఆయనను ఇటీవల ఆహ్వానించింది. ఈ క్రమంలోనే విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనుషుల్లో వైకల్యం.. పూర్వ జన్మలో వారు చేసిన చెడ్డ పనుల ఫలితమే. అందుకే ఈ జన్మలో అలా జన్మించారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం చేస్తుండగా.. ఓ ఉపాధ్యాయుడు దీన్ని ఖండించారు. ఆ సమయంలో విష్ణు అతడితో దురుసుగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చిన్నారులకు మూఢ నమ్మకాల గురించి వివరించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. మహావిష్ణు వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి. దివ్యాంగుల సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ వివాదంపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

* మల్లాపూర్‌లోని పారిశ్రామిక వాడలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెయింట్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

* తిరుమలలో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలింది. వెంటనే తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈక్రమంలో ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలోపు మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని లండన్‌లో స్థిరపడిన కడప జిల్లా వాసి ఝాన్సీ(32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లో డాక్టర్‌తో కూడిన అత్యవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నతాధికారులున్నారు.

* ఉత్తరప్రదేశ్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్‌ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికిందరు చిక్కుకొని ఉంటారి అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్‌ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా బిల్డింగ్‌ కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z