Health

మంకీపాక్స్ లక్షణాలు ఇవి

మంకీపాక్స్ లక్షణాలు ఇవి

నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని ఒణికించిన కరోనాను మర్చిపోకముందే ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. ఆఫ్రికాలో కనిపించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌కు చేరింది. ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది..

1958లో ఈ వ్యాధిని తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి సోకింది. ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపితస్తోంది. మొదట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది.

నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. నోరు, శరీరంలోని ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. రోగులు వాడిన దుస్తులు, వారు వినియోగించిన వస్తువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు.

ఈ వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి. శరీరంపై పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలా దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగుతుంది. వ్యక్తి రోగ నిరోధక శక్తిపై కూడా ఇది దాడి చేస్తుంది.

మంకీపాక్స్ ఇన్ ఫెక్షన్‌కు ఇప్పటి వరకు మందులు అందుబాటులోకి రాలేదు. కానీ మశూచీ, మంకీపాక్స్ వైరస్ లు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక గ్లోబులిన్, యాంటీవైరల్ మందులు మంకీపాక్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు రెండు రకాల టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది. వీటికి WHO అనుమతులు వస్తేగానీ వినియోగంలోకి రాదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z