ScienceAndTech

ఐటీసర్వ్ సదస్సుకు చంద్రబాబుకు ఆహ్వానం

ఐటీసర్వ్ సదస్సుకు చంద్రబాబుకు ఆహ్వానం

ఐటీసర్వ్ అలయన్స్ వచ్చే నెల లాస్‌వేగాస్‌లో నిర్వహించనున్న వార్షిక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ సంఘం ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఐటీసర్వ్ అలయన్స్ గవర్నింగ్ బోర్డు చైర్‌పర్సన్ వి.అమరేశ్వరరావు, బోర్డు మెంబర్ ఉప్పు వినోద్, సురేశ్ మానుకొండలు ఈ మేరకు ఏపీ సీఎంను కలిసి ఆహ్వానం అందజేశారు. మంత్రి నారా లోకేశ్‌ను కూడా కలిసిన ప్రతినిధులు సమావేశాల్లో గెస్ట్ స్పీకర్‌గా పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలను స్థాపించాలనుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రణాళికలను వివరించాలని కోరారు. సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందజేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z