Devotional

ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనాలపై సందిగ్ధత-NewsRoundup-Sep 10 2024

ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనాలపై సందిగ్ధత-NewsRoundup-Sep 10 2024

* వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైకాపా విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

* హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి వినాయక నిమజ్జనాలను అనుమతించడం లేదని ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున ట్యాంక్‌బండ్‌ గ్రిల్స్‌కు ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌ వైపున భారీ క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

* వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ‘ఆపరేషన్‌ బుడమేరు’ చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు.

* బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో 2019లో పిటిషన్‌ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.

* అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ హరియాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ పోటీ చేస్తుండటంతో జులానా అసెంబ్లీ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఆమె కాంగ్రెస్ అభ్యర్థికాగా.. అక్కడి నుంచి భాజపా యూత్‌ లీడర్ కెప్టెన్‌ యోగేశ్‌ బైరాగి (Captain Yogesh Bairagi)ని బరిలో దింపింది. దాంతో అక్కడ వినేశ్‌ వర్సెస్ యోగేశ్‌గా మారింది.

* ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల (Man Eating Wolves) గుంపు వణికిస్తోంది. వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ భేడియా’ (Operation Bhediya)కు మరో విజయం దక్కింది. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు మరొక తోడేలును బంధించారు. దీంతో స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదు చిక్కినట్లయింది.

* ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ నిర్వహించేందుకుగానూ.. ‘పోలారిస్‌ డాన్‌ (Polaris Dawn)’ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ దూసుకెళ్లింది.

* శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్‌ను స్పీకర్‌ నియమించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ నేను భారాస ఎమ్మెల్యేను అని పీఏసీ ఛైర్మన్‌ అరికెపూడి గాంధీ చెప్పారు. భారాస నేతలతో పీఏసీ ఛైర్మన్‌కు అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం?. ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు.

* భారత్‌లో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైనే పోరాటం కొనసాగుతోందని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ సందర్భంగా ఓ వర్గాన్ని ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. సున్నితమైన అంశాలపై మాట్లాడుతూ ప్రమాదకర వాతావరణాన్ని సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని భాజపా మండిపడింది. విదేశాల్లో నివసిస్తున్న సిక్కు వర్గంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

* నవంబర్‌ 22 నుంచి ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్‌- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో గత రెండు పర్యటనల్లోనూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది. ఇప్పుడు కూడా సిరీస్‌ను నిలబెట్టుకుని హ్యాట్రిక్‌ సాధించాలని భారత జట్టు చూస్తోంది. ఈ సారి భారత్‌ దూకుడుకు కళ్లెం వేయాలని కంగారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) ప్రశంసలు కురిపించాడు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడాడు. కోహ్లీ అద్భుతమైన బ్యాటర్‌ అని, గొప్ప వ్యక్తి అని పేర్కొన్నాడు.

* బుడమేరు, విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారాయన. తాడేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యారేజీలోకి మూడు బోట్లే కాదని.. టూరిజం బోట్లు వచ్చాయని తెలిపారు. బోట్లు తెగిపోతే వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం?. ఈ కేసులో అరెస్టైన కోమటి రామ్మోహన్‌, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులనే విషయాన్ని అంబటి ప్రస్తావించారు. కోమటి రామ్మోహన్‌ అమెరికా ఎన్నారై టీడీపీ నేత కోమటి జైరాంకు బంధువు. ఉషాద్రి లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పారు. అక్రమ కేసులతో హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్‌ జగన్‌ వెంట ఉన్న 40 శాతం ఓట్లు అంటే భయం. అందుకే వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్‌ రాకుండా కుట్రలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.

* కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విష‌మించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జ‌రుగుతుందని వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z