NRI-NRT

GWTCS-50: ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు

GWTCS-50: ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవాల (GWTCS-50) సందర్భంగా బాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలలో చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

క్రీడా విభాగం సభ్యులు సురేంద్ర ఓంకారం, దినకర్ చొప్పా,రాజేష్ కాసరనేని, విజయ భాస్కర్, శ్రీకాంత్, జగదీష్, ఈశ్వర్, భాను, గణేష్, గోపిలను అధ్యక్షుడు కృష్ణ లాం అభినందించారు. GWTCS స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రవాసులు వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z