మేషం
మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
వృషభం
ప్రారంభించిన కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. దుర్గా నామాన్ని స్మరించండి.
మిథునం
ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.
కర్కాటకం
శుభకాలం. బుద్ధి బలాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతా సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సింహం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల అంతా మంచి జరుగుతుంది.
కన్య
ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం చదవాలి.
తుల
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
వృశ్చికం
ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభకరం.
ధనుస్సు
ధర్మసిద్ధి ఉంది. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
మకరం
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
కుంభం
కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.
మీనం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z