* బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి (Mumbai)లోని తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం పుణెలో ఉన్న మలైకా అరోరా.. తండ్రి మరణవార్త తెలియగానే ముంబయి బయల్దేరారు. మరోవైపు, మలైకా మాజీ భర్త, నటుడు అర్బాజ్ ఖాన్ కూడా అనిల్ నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. మలైకా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటినుంచి మలైకా, ఆమె సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. అనిల్ (Malaika Arora Father Anil Arora) ఒంటరిగా బాంద్రాలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది ఆసుపత్రిలో చేరగా.. తండ్రిని చూసేందుకు మలైకా తల్లితో కలిసివెళ్లారు. పంజాబ్‌కు చెందిన అనిల్ అరోరా మర్చెంట్ నేవీలో పనిచేశారు.
* సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
* హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఇ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి రావడానికి నిరాకరించడంతో సదరు వ్యక్తి, ఆమెని కొట్టడమే కాకుండా వేలు విరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యూపీ రాంపూర్‌లోని షహబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళకి 2013లో నిందితుడితో వివాహం జరిగింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ తన వేధింపుల గురించి చెప్పింది. తన అత్త, భర్త కట్నం కోసం వేధించేవారని, భర్త మద్యం, జూదానికి బానిసయ్యాడని సుమారు 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నట్లు చెప్పింది. అతని స్నేహితుల వద్ద తనను కూడా పణంగా పెట్టాడని చెప్పింది. ఈ వేధింపులు భరించలేదక 112 మహిళా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశానని, పోలీసులు రావడంతో పారిపోయాడని చెప్పింది. తనను లైంగికంగా వేధించడానికి కూడా తన భర్త, అతడి స్నేహితులకు అనుమతినిచ్చాడని చెప్పింది. తనకు నీళ్లు ఇవ్వకుండా, స్నేహితుల ముందే కొట్టినట్లు చెప్పింది. తాను తన తల్లి ఇంటికి వెళ్లి సెప్టెంబర్ 04న వచ్చానని, అతని స్నేహితులు, నావేలు విరిచి తనను ఇంటి నుంచి బటయకు లాగేందుకు యత్నించారని చెప్పింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, నా భర్త, అతడి స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వెల్లడిస్తానని చెప్పింది.
* జమ్మూ కాశ్మీర్‌లోని వైమానికి దళ స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, ఇది అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులు చేసిన తీవ్రమై అత్యాచారానికి సంబంధించింది. మహిళా అధికారి ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 31, 2023 రాత్రి ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2021లో జరిగిన ఇలాంటి ఘటనలో ఐఏఎఫ్ మహిళా పైలట్ తన ఫ్లైట్ కమాండర్ తనని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ జమ్మూకాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించారు. గత రెండేళ్లుగా తనను వేధింపుకలు గురిచేస్తున్నాడని ఫ్లయింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొంది. డిసెంబర్ 31, 2023న ఆఫీసర్ మెస్‌లో జరిగిన న్యూజరిగిన న్యూ ఇయర్ పార్టీలో, ఆమెకు బహుమతి వచ్చిందా అని ఆమె సీనియర్ అడిగారని అధికారి చెప్పారు. ఆమె తన వద్ద లేదని చెప్పడంతో, వింగ్ కమాండర్ బహుమతులు తన గదిలో ఉన్నాయని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అతని కుటుంబం ఎక్కడ ఉందని ఆమె అడగగా, వారు వేరే చోట ఉన్నారని చెప్పాడు. తన సీనియర్ అధికారి తనను ఓరల్ సెక్స్‌కి బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు. తాను అతడిని అలా చేయడం మానేయమని పదేపదే అడిగానని, అన్ని విధాల ప్రతిఘటించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చివరకు అతడిని తోసి పారిపోయానని, అతడి కుటుంబం వెళ్లిన తర్వాత మళ్లీ శుక్రవారం కలుద్దామని అతడు చెప్పాడని మహిళా అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అధికారుల నుంచి సాయం లభించలేదని ఆమె ఆరోపించారు. అందరూ లైంగిక నేరస్తుడికే మద్దతు ఇచ్చారని ఆరోపించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z