వైకాపా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారారు. ఆయన వైకాపాను వీడి జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం జోరుగా సాగడమే ఇందుకు కారణం. తాడేపల్లి ప్యాలెస్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌ను కలవటం ఇదే ప్రథమం. ‘నాకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను పార్టీ పట్టించుకోవడం మానేసింది. నేనిక పార్టీలో ఇమడలేను. నా దారి నేను చూసుకుంటా’ అని బాలినేని జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరతారనీ, ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో మంతనాలు సాగించారనే ప్రచారం సాగుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z