Devotional

నందిగామలో ₹2.70కోట్ల గణపతి-BusinessNews-Sep 13 2024

నందిగామలో ₹2.70కోట్ల గణపతి-BusinessNews-Sep 13 2024

* ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలోని వాసవీ మార్కెట్‌లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని రూ.2.70 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

* అధిక వడ్డీల పేరుతో డీకే జెడ్‌ టెక్నాలజీస్‌ మోసం చేసిందంటూ బాధితులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. మాదాపూర్‌లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని రూ.700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదల బారిన పడిన వ్యక్తుల నామినీలు/లబ్ధిదారుల కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సరళతరం చేసింది. ప్రకృతి వైపరీత్యంతో తలెత్తిన విషాద తీవ్రతను గుర్తించి, బాధిత కుటుంబాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా డెత్ క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని కంపెనీ పేర్కొంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో భాగమైన వాటితో పాటు అన్ని క్లెయిమ్‌లు కేవలం మూడు ప్రాథమిక డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేయనున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అమీష్ బ్యాంకర్ తెలిపారు.

* ప్రపంచదేశాలను ప్రాణాంతక మంకీపాక్స్‌ భయాందోళనలకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. పెద్దవారిలో ఎంపాక్స్‌ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధిపై పోరాటంలో ఇది కీలక అడుగు అని పేర్కొంది. బవేరియన్‌ నార్డిక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఎంపాక్స్‌ వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్‌ అలయన్స్‌ గావీ(GAVI)తోపాటు యూనిసెఫ్‌ వంటి సంస్థలు కొనుగోలు చేయొచ్చు. తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వీటి ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్‌ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

* ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో తమిళనాడుకు చెందిన ‘శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్’ యజమాని శ్రీనివాసన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీఎస్టీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)ను ప్రశ్నించారు. రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు. అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. సదరు వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని, ఇందుకు గాను సీతారామన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది.

* తనపై వచ్చిన ఆరోపణలపై సెబీ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ (Madhabi Puri Buch) తొలిసారి స్పందించారు. సెబీ చీఫ్‌గా ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆ ఆరోపణలు తప్పని, దురుద్దేశాలతో కూడినవని పేర్కొన్నారు. సెబీ నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నానంటూ పేర్కొన్నారు. ఈ మేరకు తన భర్తతో ధావల్‌ బచ్‌తో కలిసి ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

* ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (IT dept) పన్ను డిమాండ్‌ నోటీసులు పంపింది. సుమారు 30 నుంచి 40 వేల మందికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. మూలం వద్ద పన్ను కోత (TDS) విషయంలో వ్యత్యాసాలు ఉండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆయా నోటీసుల్లో పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z