Devotional

Horoscope in Telugu – Sep 14 2024

Horoscope in Telugu – Sep 14 2024

మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి, ముఖ్య విషయాల్లో మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం శుభప్రదం.

వృషభం
పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మిథునం
లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

కర్కాటకం
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

సింహం
సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.

కన్య
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం
చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు
ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం మంచిది.

మకరం
ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మీ సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ప్రారంభించిన పనిలో శుభఫలితాలు పొందడానికి శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

కుంభం
మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం
పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. శ్రీగణపతి ఆరాధన శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z