ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో వరద సహాయ కార్యక్రమాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. అవనిగడ్డలో బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 200 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, టవల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి స్టేట్ మీడియా ఇన్ చార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రమేష్, శ్రీధర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పాల్గొని తానా ఫౌండేషన్ సేవలకు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z