NRI-NRT

GWTCS క్రికెట్ టోర్నమెంట్ విజేతగా యానిమల్ పార్క్ జట్టు

GWTCS క్రికెట్ టోర్నమెంట్ విజేతగా యానిమల్ పార్క్ జట్టు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా గత నెల రోజులుగా అమెరికా రాజధాని డీసీలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. మొత్తం 20 జట్లు పోటీపడగా తుదిసమరంలో యానిమల్ పార్క్ జట్టు విజయ సాధించింది.

అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ అమెరికాలో క్రికెట్ క్రీడకు గణనీయంగా పెరుగుతన్న ఆదరణ గమనించి, పూర్తి స్థాయిలో ఈ పోటీలు నిర్వహించామని, నిర్వహణకు సహకరించిన రామ్ మైనేని మిత్ర బృందాన్ని ధన్యవాదాలు తెలిపారు. అనమతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో GWTCS స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రవాసులు కుటుంబసమేతంగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు https://www.gwtcs50.org/ చూడవల్సిందిగా కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z