Devotional

Horoscope in Telugu – Sep 16 2024

Horoscope in Telugu – Sep 16 2024

మేషం
శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. అశ్విని(ప్రత్యక్ ), కృత్తికా(విపత్) నక్షత్ర జాతకులు నూతన కార్యాలు ఈ రోజు ప్రారంభించకుండా ఉండడం మేలు. సూర్య ధ్యానం మంచిది.

వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధన్య లాభాలున్నాయి. మృగశిర నక్షత్ర (జన్మ ) జాతకులు దూరప్రయాణాలు చేయకుండా ఉండటం మేలు. ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం.

మిథునం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఇష్టసిద్ధి ఉంది. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో వ్యవహరించాలి. నిరంతర సాధన వల్ల మేలు చేకూరుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటకం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. దుర్గా దేవిని సందర్శించడం మంచిది.

సింహం
మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు పుబ్బ (క్షేమ) నక్షత్రం వారికీ అనుకూలంగా ఉంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

కన్య
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. ధర్మసిద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధి కొరకు లక్ష్మీఅష్టోత్తర పారాయణం శుభప్రదం.

తుల
ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. బంధువుల సహకారం అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంది. పంచమంలో చంద్రుడు ఉన్నాడు చంద్ర శ్లోకం చదవండి.

వృశ్చికం
మొదలు పెట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా ముందస్తు ప్రణాళికలను రచించాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

ధనుస్సు
శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. గురు చరిత్ర చదవడం మంచిది.

మకరం
చక్కటి శుభకాలం. చేపట్టే పనులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం ఉంది. ద్వితీయంలో చంద్ర సంచారం ఉంది. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభదాయకం.

కుంభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏపని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్ధ చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

మీనం
మిశ్రమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z