NRI-NRT

కెనడాలో హైదరాబాదీ మృతి-CrimeNews-Sep 16 2024

కెనడాలో హైదరాబాదీ మృతి-CrimeNews-Sep 16 2024

* కెనడాలో హైదరాబాద్‌ యువకుడు మృతిచెందాడు. మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్‌ అక్కడ ఎంఎస్‌ చదువుతున్నాడు. తన సోదరుడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్‌ క్లియర్‌కు స్విమ్మింగ్‌ వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో ప్రణీత్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

* అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై నమోదైన కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేయగా, ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యారని.. 2019లో అతడి వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరినట్లు ఆమె తెలిపింది. ఓసారి ముంబయి వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఆమె చెప్పారు. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్‌ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్‌’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్‌ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏపీ గిరిజన గురుకుల కళాశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. చెప్పిన మాట వినడం లేదంటూ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులతో గుంజీలు తీయించారని వారు ఆరోపించారు. ఒక్కసారిగా 200 గుంజీలు తీయడంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు.

* ప్రమాదవశాత్తు డీజీల్‌ ట్యాంకర్‌ దగ్ధమైంది. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లాలోని సిద్ధవటం మండలం మాధవరం వద్ద రహదారిపై జరిగింది. కడప నుంచి తిరుపతి వైపునకు పది టైర్ల డీజీల్‌ ట్యాంకర్‌ లోడుతో వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్‌ ట్యాంకర్‌ను మాధవరం వద్ద రహదారి పక్కన ఆపాడు. కొంతసేపటికే ఒక్కసారి డీజిల్ ట్యాంకర్‌ లోనుంచి మంటలు చెలరేగి.. లారీ మొత్తం వ్యాపించాయి. డీజిల్ ట్యాంకర్‌ కావడం, సమీపంలో గ్యాస్ గోదాం ఉండటంతో స్థానికులు ఎవరు సాహసించి ముందుకు వెళ్లలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

* భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్‌ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z