ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగో విభాగం దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్)లో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించి, పచ్చదనాన్ని పరిరక్షించే ప్రయత్నం చేశారు. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేందర్ కడియాల, వీర తక్కెళ్లపాటి, హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలా, సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు కృషి చేశారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వీరిని అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z