NRI-NRT

నాట్స్…UPSC అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ

నాట్స్…UPSC అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ

నాట్స్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది. నాట్స్ మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్‌ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పేద విద్యార్ధుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z