ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఆదివారం నాడు న్యూయార్క్‌లో “ఆటా-పాటా” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటి, వ్యాఖ్యాత సుమ సందడి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం వినియోగిస్తామని తానా ప్రాంతీయ ప్రతినిధి దీపిక సమ్మెట, తానా ప్రతినిధులు తూనుగుంట్ల శిరీష, రామిశెట్టి సుమంత్‌లు తెలిపారు.
మానవతా దృక్పథంతో తానా చేస్తున్న కృషిని న్యూయార్క్ ప్రవాసులు అభినందించారు. జయశేఖర్ తాళ్ళూరి, మోహన్ బాధే, కల్పన వనం, రావు వోలెటి, దేవ రత్నం, కృష్ణ గుజవర్తి, పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల, తిరుమల రావు తిపిర్నేని,కిషోర్ కుంచం, శ్రీదేవి భూమి, జగ్గా అల్లూరిలు విరాళాలు అందించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన్ పదిలక్షల రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందజేశారు.
శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యానంలో సాగిన ఈ సందడిలో డా. నోరి దత్తాత్రేయ, నెహ్రూ చెరుకుపల్లి, TLCA, NYTTA, TTA, MATA సంస్థల ప్రతినిధులు, సత్య చల్లపల్లి, జయప్రకాష్ ఇంజపూరి, శైలజా చల్లపల్లి, విజయ్ లోతుగడ్డ, సాయి దేవినేని, మురళీ, రావు వోలెటి, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్, యమున, శైలజ శంకర్ తదితరులు పాల్గొని సహకరించారు. కష్టకాలంలో ముందుకు వచ్చి సమాజహిత కార్యక్రమాలు చేపట్టిన న్యూయార్క్ తానా ప్రతినిధులను అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z