డిసెంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను సెప్టెంబరు 18 (బుధవారం)న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20 ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు సెప్టెంబరు 21న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి డిసెంబరు నెల కోటా సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3గంటలకు విడుదల. డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా 23న ఉదయం 10గంటలకు విడుదల. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి డిసెంబరు నెల కోటా ఆన్‌లైన్‌లో 23న ఉదయం 11 గంటలకు విడుదల.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. డిసెంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
సెప్టెంబరు 27న తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z