* స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సుప్రీం కోర్టు (Supreme Court) వెలువరించిన వాటిలో దాదాపు 37 వేల తీర్పులను ఇప్పటి వరకు హిందీలోకి అనువదించినట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud) తాజాగా వెల్లడించారు. వివిధ భారతీయ భాషల్లోకి తీర్పులను అనువదించే ప్రక్రియ కొసాగుతోందని తెలిపారు.
* జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను త్వరలో జనసేన గూటికి చేరనున్నట్టు సమాచారం. గురువారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ‘‘వైకాపాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా మనసుకు కష్టం కలిగినందునే పార్టీ వీడాను. జగన్‌ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదు. పరిణామాలు చూస్తే వైకాపాకి భవిష్యత్తు కనిపించట్లేదు. భవిష్యత్తు చూసుకోవాలనే మేము బయటకు వచ్చాం. పవన్‌ను కలిసి అన్ని విషయాలు చర్చించా’’ అని ఉదయభాను తెలిపారు.
* రాజధానికి ఎలాంటి పెట్టుబడులు రాకూడదనే లక్ష్యంతో వైకాపా కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి సముద్ర నీటి మట్టం కంటే 35 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. రాజధానిలో యథావిధిగా కార్యకలాపాలు జరుగుతుండటం చూసి వైకాపా నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి మూడో కేజీఎఫ్ అని దుయ్యబట్టారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాకాణి అవినీతిపై త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. జగన్ వైఖరితో విసిగిపోయి ఆ పార్టీని పలువురు నేతలు వీడుతున్నారన్నారు. వైకాపా మొత్తం ఖాళీ అయి ఇక ఆ పార్టీలో జగన్, ఆయన భార్య భారతి మాత్రమే మిగిలిపోతారేమోనని వ్యాఖ్యానించారు.
* వైకాపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. నిన్న వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం బాలినేని.. నాగబాబుతో చర్చలు జరిపినట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన గూటికి చేరే అవకాశముంది.
* ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వానిది కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిది ఒకే మాటని పాక్ రక్షణశాఖ మంత్రి ఖావాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల (US President Elections) వేళ.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) ఇటీవల వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపాయి. వీటిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న కొందరు మద్దతుదారులు వింత అనారోగ్యానికి గురవడం చర్చనీయాంశమైంది.
* లెబనాన్‌లో హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ఎంతలా పనిచేసిందో మెల్లగా వెలుగులోకి వస్తోంది. తాజాగా ముగ్గురు అమెరికా అధికారులు న్యూయార్క్‌టైమ్స్‌తో మాట్లాడుతూ చాలా లోతుగా టెల్‌అవీవ్ ప్లాన్‌ను వివరించారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించితెలిసిన హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా మొదటి నుంచి మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూనే వచ్చారు.
* చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలంటూ రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యద్ధం విషయంలో స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోన్న భారత్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఒకపక్క రష్యా(Russia) అభ్యంతరం చెప్తున్నప్పటికీ.. మన దేశానికి చెందిన ఆర్టిలరీ షెల్స్ (శతఘ్ని తూటాలు) ఉక్రెయిన్ వినియోగిస్తోందని తాజాగా అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
* కుండపోత వర్షాలు, వరదలతో విలవిల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ రూ. 25 కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు గౌతమ్ అదానీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అపార నష్టం చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
* బిహార్‌లోని నవాడా జిల్లాలో 21 ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇళ్లను తగలబెట్టిన ఘటనలో 15 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. వారి స్వార్థం కారణంగా కశ్మీరీ ప్రజలకు పెను నష్టం వాటిల్లిందన్నారు.
* చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రూ.3 కోట్లతో డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహించే అవకాశముందన్నారు. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ యూనిట్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
* మాజీ మంత్రి విడదల రజినీపై పల్నాడు జిల్లా యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. తమ నుంచి రజనీ, ఆమె పీఏ గోపి రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి.. విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి రజిని అక్రమాలు ఇటీవల ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జగనన్న కాలనీ పేరిట తమవద్ద భూములు సేకరించి కమీషన్ వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్‌లో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీమంత్రి రజిని అనుచరులు సేకరించారు. 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజిని నుంచి రూ.1.16 కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు, ఎంపీకి విన్నవించుకోగా ఆ మొత్తాన్ని ఇప్పించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z