* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అనుబంధ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు (HDB Financial IPO) కంపెనీ బోర్డు సూత్రప్రాయ అనుమతి తెలిపింది. రూ.10 ముఖ విలువ కలిగిన రూ.2500 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా జారీ చేయనున్నట్లు హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌లో ప్రస్తుత, అర్హులైన వాటాదారులు కూడా తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించేందుకూ బోర్డు అనుమతిచ్చిందని తెలిపింది.
* సిక్కింలో ప్రభుత్వ యాజమాన్యంలోని NHPC నుంచి జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం రూ.240 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు పటేల్ ఇంజనీరింగ్ లిమిఎడ్ ఈ రోజు(శుక్రవారం) తెలిపింది. ఈ కాంట్రాక్ట్ ఆర్డర్ 18 నెలల వ్యవధిలో పూర్తవుతుందని పటేల్ ఇంజినీరింగ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రాజెక్ట్‌లో భాగంగా టన్నెల్ మళ్లింపు, సొరంగంలో స్పిల్‌వే అమరికతో పాటు సివిల్, హైడ్రో మెకానికల్ పనులు ఉంటాయి. పటేల్ ఇంజినీరింగ్..నీటి పారుదల, సొరంగాల, జలవిద్యుత్, ఆనకట్ట ప్రాజెక్టులకు సంబంధించిన భూగర్భ పనులలో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీకి 85 ఆనకట్టలు, 40 జలవిద్యుత్ ప్రాజెక్టులు, 300 కి.మీ కంటే ఎక్కువ టన్నెలింగ్‌ను పూర్తి చేసిన అనుభవం కూడా ఉంది.
* ఇల్లు కట్టుకోవాలన్నా.. కారు కొనుక్కోవాలన్నా.. ఇలా ఇతరత్రా కారణాలతో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు (Bank Loans) తీసుకోవడం సహజమే. వ్యక్తి ఆర్థికస్థితిని ఆధారంగా చేసుకుని ఆయా సంస్థలు ఈ రుణాలు మంజూరు చేస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు కావాల్సినంత రుణం దొరక్కపోవచ్చు. అందుకోసమనే కొందరు రుణ దరఖాస్తుల్లో వచ్చేదాని కంటే ఎక్కువ ఆదాయాన్ని (Income) పేర్కొంటారు. అయితే, ఇలా చేయడం సాధారణమేనట..! మన దేశంలోని ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఆర్థికపరమైన మోసాలపై ప్రజల వైఖరి ఎలా ఉందన్న అంశంపై ‘ఫికో’ అనే గ్లోబల్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇటీవల సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రుణ దరఖాస్తుల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆదాయాన్ని చూపించడం మూమూలేనని 27శాతం మంది భారతీయులు అభిప్రాయపడుతున్నట్లు తేలింది. లోన్ కోసం ఆదాయం ఎక్కువ చెప్పడం సాధారణమేనని ప్రతి ఐదుగురిలో ముగ్గురు చెప్పినట్లు సర్వే తెలిపింది.
* యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో బంగారం ధర ధగధగ మెరుస్తోంది. దీనికి తోడు దేశీయంగా ఫెస్టివల్ సీజన్, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో పుత్తడి ధర సరికొత్త పుంతలు తొక్కుతున్నది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.700 పెరిగి రూ.76,350లకు చేరుకున్నది. గురువారం పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.75,650 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గోల్డ్ కాంట్రాక్ట్స్ అక్టోబర్ డెలివరీ ధర రూ.341 వృద్ధితో రూ.73,779 పలికింది. కిలో వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.145 పుంజుకుని రూ.90,113లకు చేరుకున్నది. గత నెలలో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతి జిరగిన సంగతి తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z