NRI-NRT

విజయవంతంగా “తానా కళాశాల” పరీక్షలు

విజయవంతంగా “తానా కళాశాల” పరీక్షలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తానా కళాశాల కోర్సుల వార్షిక పరీక్షలకు వందలాదిమంది విద్యార్థులు హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతాలలో కళాశాల నిర్వహిస్తున్న ఈ కోర్సులకు ఆదరణ ఉంది.

వివిధ రాష్ట్రాలలో ఈ పరీక్షలు విజయవంతంగా జరగడం పట్ల తానా కళాశాల చైర్ మాలతి నాగభైరవ, తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే వార్షిక సంవత్సరము నుండి వీణ, మృదంగం తదితర కోర్సులను కూడా చేర్చి ఈ కార్యక్రమ విస్తృతిని పెంచుతామని మాలతి తెలిపారు.

తానా కళాశాల సలహాదారుడు రాజేష్ అడుసుమిల్లి, కళాశాల కోఆర్డినేటర్స్ వెంకట్ ఆవిర్నేని, రవీంద్ర చిట్టూరి, రమా ప్రత్తిపాటి మరియు తానా ప్రతినిధులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి, వెంకీ అడబాల, రామకృష్ణ వాసిరెడ్డి, నాగ పంచుమర్తి, పరమేష్ దేవినేని, శ్రావణి సుధీర్ తదితరులు సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z