* అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు (Taliban) అనేక ఆంక్షలు పెడుతూ వారి హక్కులను కాలరాస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత మెరిల్ స్ట్రీప్ ఐరాస వేదికగా స్పందించారు. అఫ్గాన్‌లో పిల్లులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, అమ్మాయిల కంటే ఉడుతలకే హక్కులు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
* తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.
* పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లూ హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన పోరు.. ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు 400 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేల మంది క్షతగాత్రులయ్యారు. అయితే, హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదని, దాదాపు 4 దశాబ్దాలకు పూర్వమే వీరి మధ్య వైరం పురుడుపోసుకుందని చరిత్ర చెబుతోంది.
* తనను ఒక దొంగగా చిత్రీకరించేందుకు భాజపా భావించిందని ఆప్ (AAP) జాతీయ కన్వీనర్, దిల్లీ (Delhi) మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. అందుకే తనను అరెస్టు చేయించిందని అన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రానియా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* రియల్‌టైమ్‌లో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
* కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం విచారణకు హాజరయ్యారు. డిజైన్లు, డ్రాయింగ్‌లు ఎవరు తయారు చేశారని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించగా.. వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిందని సమాధానమిచ్చారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆమె పిటిషన్ వేశారు. మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లనీ కలిపి విచారించాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు.
* తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నటుడు కార్తి లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీంతో కార్తి క్షమాపణలు చెప్పారు. తనకు పవన్‌కల్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు.
* ఉన్నావ్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు ఇచ్చిన సీఆర్పీఎఫ్ భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు స్పందించాలని న్యాయస్థానం కోరింది.
* ఎంబీబీఎస్ కళాశాల్లో ప్రవేశాల నిమిత్తం ఇటీవల పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుబట్టింది. ఆ కోటా మోసం తప్ప మరొకటి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థి అనే పదం పరిధిని విస్తృతం చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కొన్నిరోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది.
* ట్రామ్.. ఈ పేరు వినగానే మనకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతానే గుర్తొస్తుంది. వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఈ రవాణా సదుపాయం ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నది ఈ ఒక్క నగరంలోనే. అయితే, ఈ సేవలకు ముగింపు పలకాలని బెంగాల్ సర్కారు నిర్ణయించింది.
* శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం.
* ‘యానిమల్’ (Animal Movie) సినిమాలో నటించి విశేష క్రేజ్ సొంతం చేసుకుంది త్రిప్తి డిమ్రీ (Tripti Dimri). తన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’తో వినోదం పంచిన ఆమె త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్‌రావ్ సరసన నటించిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ (Vicky Vidya Ka Woh Wala Video) అక్టోబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు డ్యాన్స్ ఇష్టమని తెలిపింది. ఇప్పటి వరకూ డ్యాన్స్ నంబర్ చేయలేదనే లోటు ‘మేరే మెహబూబ్’ (Mere Mehboob) (విద్యా కా వో వాలా వీడియోలోని పాట) తీర్చిందని చెప్పింది. ఆ పాట చిత్రీకరణ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది.
* శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పవర్ (NPP)కి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, మరో ఇద్దరు నేతలను క్యాబినెట్ మంత్రులుగా నియమించారు. దీంతో శ్రీలంకలో దిసనాయకేతో పాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినెట్ కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
* ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నలకు సమాధానమిస్తానని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి’’ అని పేర్కొన్నారు.
* ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియమకాల్లో తెదేపాతో పాటు భాజపా, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా తెదేపా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్, శాప్ ఛైర్మన్‌గా రవినాయుడును ఎంపిక చేసింది. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. యువతకు ప్రాధాన్యం కల్పించారు. 11 మంది కస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్ పదవి వరించింది.
కార్పొరేషన్- ఛైర్మన్‌ల వివరాలివే..
వక్ఫ్‌బోర్డు- అబ్దుల్ అజీజ్ (తెదేపా)
శాప్- అనిమిని రవి నాయుడు (తెదేపా)
గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (తెదేపా)
ఏపీ ట్రైకార్- బొరగం శ్రీనివాసులు (తెదేపా)
ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (తెదేపా)
సీడాప్- దీపక్‌రెడ్డి (తెదేపా)
20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్ (భాజపా)
మార్క్‌ఫెడ్- కర్రోతు బంగార్రాజు (తెదేపా)
సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- మన్నె సుబ్బారెడ్డి (తెదేపా)
ఏపీఐఐసీ- మంతెన రామరాజు (తెదేపా)
పద్మశాలి కార్పొరేషన్- నందం అబద్ధయ్య (తెదేపా)
ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (తెదేపా)
ఏపీఎస్ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం (తెదేపా)
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్- పీలా గోవింద సత్యనారాయణ (తెదేపా)
లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్- పిల్లి మాణిక్యాల రావు (తెదేపా)
వినియోగదారుల రక్షణ కౌన్సిల్- పీతల సుజాత (తెదేపా)
ఎంఎస్‌ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
పౌరసరఫరాల కార్పొరేషన్- తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (తెదేపా)
ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z