NRI-NRT

జర్మనీ ఎన్నారై తెదేపా కార్యకర్తల సమావేశం

జర్మనీ ఎన్నారై తెదేపా కార్యకర్తల సమావేశం

ఎన్నారై తెదేపా జర్మనీకు చెందిన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీలో 100 రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి.. తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వంద రోజుల పాలనలోనే వృద్ధులకు నాలుగు వేల పింఛను ఇవ్వడం, వికలాంగులకు ఆరు వేలు ఇవ్వడం, అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంబించి లక్షల మంది ఆకలి తీర్చడంలాంటివి జరిగాయని కొనియాడారు. మెగా డీఎస్సీపై సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, కొప్పర్తి/ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు చేయడంలాంటి అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వం నిరంతరం కొనసాగాలని.. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దూసుకుపోతుందని విశ్వాసం వ్యక్తం చేసారు. అలాగే గత వైకాపా పాలనలో తిరుమల లడ్డూని అపవిత్రం చేశారని ప్లకార్డులతో తీవ్రంగా ఖండించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z