NRI-NRT

తానా కరోలినాస్ బ్యాడ్మింటన్‌ పోటీలు విజయవంతం

తానా కరోలినాస్ బ్యాడ్మింటన్‌ పోటీలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శనివారం నాడు తానా కరోలినాస్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించింది. కిడ్స్‌ డబుల్స్‌, యూత్‌ డబుల్స్‌, మెన్స్‌ డబుల్స్‌, ఉమెన్‌ డబుల్స్‌, మిక్స్డ్‌ డబుల్స్‌ పోటీలతో పాటు ప్రత్యేకంగా లెజెండ్స్‌ (40 Years) కోసం కూడా ఇందులో పోటీని ఏర్పాటు చేశారు.

ఈ పోటీల్లో ఒక విభాగంలో విజేతగా తండ్రీ కొడుకులు నిలిచారు. తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి మాట్లాడుతూ, 40 ఏళ్ళ వయస్సు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల విజయవంతానికి తానా ఈవెంట్ కోఆర్డినేటర్‌ అమూల్య కుడుపూడి, దినేష్ డొంగా, తానా రీజినల్ కోఆర్డినేటర్‌ ‌‌రాజేష్‌ యార్లగడ్డ, తానా ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఠాగూర్ మల్లినేని, టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి,
రవి వడ్లమూడి తదితరులు కృషి చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z