NRI-NRT

న్యూయార్క్‌లో విజయవంతంగా “Modi & US” కార్యక్రమం

న్యూయార్క్‌లో విజయవంతంగా “Modi & US” కార్యక్రమం

న్యూయార్క్‌ లోని లాంగ్ ఐలాండ్‌లో నాసావు కొలీజియంలో జరిగిన ‘మోడీ అండ్ యూఎస్‌’ గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమం ఘన విజయం సాధించిందని OFBJP ఒక ప్రకటనలో తెలిపింది. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం ఇకపై అవకాశాల కోసం ఎదురుచూడదు. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మించబడింది. ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ కొత్త ఐటీఐని ఏర్పాటు చేస్తున్నారు. 10 ఏళ్లలో ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కి పెరిగింది. ఇప్పటి వరకు భారతీయ డిజైనర్ల నైపుణ్యాన్ని ప్రపంచం చూసింది. ఇకపై భారతదేశం డిజైన్ వైభవాన్ని ప్రపంచం చూస్తుందని మోదీ అన్నారు. “భారత్ మాతా కీ జై!” నినాదంతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నమస్తే’ కూడా లోకల్‌ నుంచి గ్లోబల్‌గా మారిందని, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకే ఈ ఘనత ద‌క్కుతుంద‌ని మోదీ అన్నారు. ఈ సెంటిమెంట్ మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే మ‌న‌ అతిపెద్ద బలం. ఈ సెంటిమెంట్ శాంతియుతంగా, చట్టాన్ని గౌరవించే ప్రపంచ పౌరులుగా ఉండటానికి మ‌న‌కు సహాయపడుతుంది. భారతదేశం ప్రపంచ విశ్వ బంధు అని ప్రపంచాన్ని గ్రహించేలా చేస్తుందని ప్ర‌ధాని అన్నారు. ఇరు దేశాల మధ్య వారధిగా ఉంటూ భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేయ‌డంలో భార‌తీయ ప్ర‌వాసులు ఎంతో దోహదపడ్డార‌ని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి భారత ప్రధానిని నేనే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలో దేశం కోసం చావలేమని, దేశం కోసం తప్పకుండా బతకగలమని అన్నారు.

మూడో టర్మ్‌లో మనం చాలా పెద్ద లక్ష్యాలను సాధించాలి. మూడింతలు బలం, మూడింతల వేగంతో ముందుకు సాగాలన్నారు. ఈ క్రమంలో పుష్పంలోని ఐదు ఆకులను (PUSHP) కలిపి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టిస్తామని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఐదు ఆకుల అర్థాన్ని కూడా ప్రధాని మోదీ వివరించారు. మోదీ ప్రస్తావించిన PUSHP పదానికి అర్థం

పీ – ఫర్ ప్రోగ్రెసివ్ ఇండియా

యూ – ఫర్ అన్ స్టాపబుల్ ఇండియా

ఎస్ – ఆధ్యాత్మిక భారతదేశం కోసం(స్పిరిచువల్ ఇండియా)

హెచ్ – భారతదేశం హ్యుమానిటీ ఫస్ట్‌కు అంకితం చేయబడింది

పీ – సంపన్న భారత్ కోసం

బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో రెండు కొత్త కాన్సులేట్లను భారత్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ నగరాల్లో కాన్సులేట్ ఆఫీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ అమెరికన్స్‌ చాలా రోజులుగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోదీ చొరవతో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్, అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌లలో ఆరు ఇండియన్ కాన్సులేట్లు ఉన్నాయి. ఈ పర్యటనలో ప్రధాని OFBJP శ్రేణులతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి ఈ విభాగం అందజేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో డా. విజయ్ చౌథైవాలె, కృష్ణారెడ్డి, అడపా ప్రసాద్, గణేష్ రామకృష్ణన్, మంజునాథ్, నిర్మల రెడ్డి, విలాస్ రెడ్డి జంబుల, శరత్ వేముల, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, మధుకర్, శ్రీనివాస్ నాతి, రాజు, కృష్ణా గుడిపాటి, దిగంబర్, రఘు శర్మ శంకరమంచి , హనుమంత్ పదార్థి, భీమా పెంట , శ్యామ్ ఏనుగంటి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z