NRI-NRT

గుమ్మడి గోపాలకృష్ణకు GWTCS పురస్కారం

గుమ్మడి గోపాలకృష్ణకు GWTCS పురస్కారం

ప్రముఖ రంగస్థల నటుడు, ఏపీ నాటక అకాడమీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 50ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) స్వర్ణోత్సవ(50) వేడుకల్లో GWTCS Presidential Award అందుకోనున్నారు. శుక్ర, శనివారాల్లో వర్జీనియాలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో గుమ్మడికి ఈ అవార్డు ప్రదానం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు లాం కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నాటక రంగానికి గోపాలకృష్ణ చేసిన విశిష్ట సేవలకు GWTCS ఆయన్ను ఈ విధంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందని కృష్ణ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z