బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఏర్పడి 50ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రోజుల స్వర్ణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో బ్యాంక్వెట్ విందుతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభమయింది.
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎన్నారై తెదేపా ప్రతినిధులు కోమటి జయరాం, వేమన సతీష్, రచయిత జొన్నవిత్తుల, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. GWTCS కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ సంస్థ ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు తన హయాంలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు, స్థానిక ప్రవాసులకు వారధిగా GWTCS మన్ననలు అందుకుందని, అందుకు తాము గర్విస్తున్నామని తెలిపారు. బ్యాంక్వెట్ విందులో భాగంగా పలువురు ప్రవాసులకు, తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రవాస ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. మయూరి రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు భోజనం అలరించింది.
స్థానిక ప్రవాసుల శివతాండవం, నాట్య ప్రదర్శనలు అలరించాయి. ప్రవాస ప్రముఖులు డా. యడ్ల హేమప్రసాద్, డా. మూల్పూరి వెంకటరావు, మన్నే సత్యనారాయణ, పాలడుగు సాయిసుధ, డా. కొడాలి నరేన్, గౌర్నేని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నాటి కార్యక్రమాలు శ్రీనివాస కళ్యాణంతో ప్రారంభం అవుతాయి. వివరాలకు https://www.gwtcs50.org చూడవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z