ఖమ్మం శాంతినగర్ ఉన్నత పాఠశాలలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో “ఆదరణ” పథకం కింద 60మంది బాలికలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్ర రాలేకి చెందిన ప్రశాంత్ కాట్రగడ్డ తన కుటుంబ సబ్యురాలు సునీత స్మారకార్థం ఈ వితరణ చేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ, ఫౌండేషన్ తరపున వివిధ కార్యక్రమాలను చేస్తున్నామని, ఆదరణ పథకంతో పాటు వరదబాధిత విద్యార్థుల కుటుంబాలకు కూడా తానా ఫౌండేషన్ సహాయం అందిస్తున్న సంగతిని వివరించారు. వరదల కారణంగా ధ్వంసమైన స్కూళ్ళలో బెంచీలు, కుర్చీల మరమ్మతుల కోసం ₹2లక్షలను ఆయా పాఠశాలలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ₹2లక్షల చెక్కును ఖమ్మం అర్బన్ విద్యాధికారి శ్రీరాములుకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాన్ బస్కో, తుమ్మల యుగంధర్, సహస్ర మినిస్ట్రీస్ అధ్యక్షులు లాల్ బహుదూర్ శాస్త్రి, కూరపాటి ప్రదీప్, NRI ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, గడ్డం వేంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్షలు వాసిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z