NRI-NRT

న్యూజెర్సీలో ఉల్లాసంగా నాట్స్ వాలీబాల్ పోటీ

న్యూజెర్సీలో ఉల్లాసంగా నాట్స్ వాలీబాల్ పోటీ

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) న్యూజెర్సీలో వాలీబాల్ పోటీలను నిర్వహించింది. పురుషులు, మహిళల రెండు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. అడ్వాన్స్ లీగ్, ఇంటర్మీడియట్ లీగ్ పేర్లతో జరిగిన ఈ టోర్నమెంట్లలో విజేతలుగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్, థండర్ స్ట్రైకర్స్, హిల్స్‌బోరో ఎవెంజర్స్, స్పైకర్స్, బ్లాకర్స్, మార్ల్‌బోరో విల్లీబాయ్జ్, ఎస్ఎస్ అప్‌సెట్టర్స్ జట్లకు, రన్నరప్ జట్లకు నాట్స్ నాయకత్వం బహుమతులు అందచేసింది. తెలుగు వాలీబాల్ ఆటగాళ్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ అన్నారు. న్యూజెర్సీలో ఉండే తెలుగువారి కోసం నాట్స్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి తెలిపారు. శ్రీనివాస్ భీమినేని, రంగరాజు చేకూరి, సుఖేష్ సబ్బాని, నీలం శ్రీనివాస్, వాసు ఏ, వీరన్న బాబు, సత్య, సారధి నారా, భార్గవి తుమ్మల, సర్వేశ్, వెంకట్ కోడూరి, కిరణ్ మందాడి తదితర వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం చొరవను అధ్యక్షుడు మదన్ పాములపాటి, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అభినందించారు.

టీం విజేతల వివరాలు
ఎ లీగ్ విజేతల జట్టు పేరు: ఆర్ ఆర్ ఆర్ విజేత కెప్టెన్: త్రివేది
ఎ లీగ్ రన్నరప్ జట్టు పేరు: థండర్ స్ట్రైకర్స్
రన్నరప్ కెప్టెన్: ప్రవీణ్

గర్ల్స్ లీగ్: విజేతల జట్టు పేరు: స్పైకర్స్ విజేత
కెప్టెన్: లాస్య
గర్ల్స్-లీగ్
రన్నరప్ జట్టు పేరు: బ్లాకర్స్
రన్నరప్ కెప్టెన్: తాన్సీ

బీ-లీగ్ విజేతల జట్టు పేరు: ఎవెంజర్స్
విజేత కెప్టెన్: రాజా
బీ-లీగ్ రన్నరప్ జట్టు పేరు: మార్ల్‌బోరో వాలీబాయ్జ్
రన్నరప్ కెప్టెన్: విష్ణు


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z