NRI-NRT

మహిళల కోసం ప్రత్యేక వేదిక ప్రారంభించిన తానా

మహిళల కోసం ప్రత్యేక వేదిక ప్రారంభించిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహిళలకోసం కొత్త ఫోరమ్‌ ను ప్రారంభించింది. Harmony Haven:Womens Wellness Exchange పేరుతో దీనిని ప్రారంభించినట్లు తానా ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ సోహిని అయినాల తెలిపారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ అనుభవాలు, ఆలోచనలను పంచుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఆలోచనల వ్యక్తీకరణ, పరస్పర మద్దతు అందిపుచ్చుకోవడం దీని లక్ష్యమని ఆమె అన్నారు. Navigating the teenage years and providing support పేరుతో ఫోరమ్‌ నిర్వహించిన మొదటి ఈవెంట్‌ విజయవంతమైంది. ఈ ఈవెంట్‌ మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించడంపై దృష్టి సారించింది.

కార్యక్రమంలో డాక్టర్‌ గౌరి తుమ్మల, డాక్టర్‌ ఆయేషా సునేజా-సేయమూర్‌, నమ్‌రత దేసాయ్‌ దేవాన్‌, పవని గద్దె తదితరులు పాల్గొన్నారు. Episode 2: The hormonal journey of a women పేరిట రెండో కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని సోహిని తెలిపారు. కవిత కాట్రగడ్డ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z