Movies

“లారీడ్రైవర్” విలన్ మృతి

“లారీడ్రైవర్” విలన్ మృతి

‘‘అచ్చుతప్పు.. మన పేరు గుడివాడ రాయుడు.. ‘రాయుడు’ అని నోరు తిరగక రౌడీ అంటున్నారు’’ అంటూ ‘లారీ డ్రైవర్‌’ సహా (Lorry Driver) తెలుగు చిత్రాల్లో తనదైన విలనిజాన్ని పండించిన నటుడు మోహన్‌రాజ్‌ (72) (Actor Mohan Raj) ఇక లేరు. ‘కిరిక్కాడాన్‌ జోస్‌’ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు. నటుడు, దర్శకుడు, పి.దినేశ్‌ పనికర్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ విచారం వ్యక్తం చేశారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z