నాట్స్ లాస్ ఎంజిల్స్ విభాగా 2024-2026 సమన్వయకర్తగా ముద్దన మురళీ బాధ్యతలు చేపట్టారు. ఈ విభాగ కార్యవర్గం తొలి సమావేశంలో లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్‌లో నిర్వహించారు. బాలల సంబరాల నిర్వహణ, తెలుగు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు. నాట్స్ హెల్ఫై లైన్ సేవలను విసృత్తం చేసేలా నాట్స్ సభ్యులు రవి ఆలపాటి కోరారు. డాక్టర్ వెంకట్ ఆలపాటి, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, శ్రీ మనోహర రావు మద్దినేని, రాజ్యలక్ష్మి చిలుకూరి, లాస్ ఎంజిల్స్ నాట్స్ సహాయ సమన్వయకర్త బిందు కామిశెట్టి, శంకర్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి, శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, శ్యామల చెరువు, లత మునగాల, సిద్ధార్థ కోల, శ్రీరామ్ వల్లూరి, శివ కోత, అరుణ బోయినేని, హరీష్ అందె, చంద్ర మోహన్ కుంటుమళ్ల, గురు కొంక, రాధా తెలగం, పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*** అట్లాంటలో నాట్స్ పికిల్ బాల్ పోటీ
నాట్స్ అట్లాంటాలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 52 జట్లు పోటీ పడ్డాయి. అడ్వాన్స్ క్యాటగిరిలో ఏసెస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరి నుండి ఎన్.సి.టి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. సెమీ-ఫైనల్ రన్నరప్ క్యాటగిరి నుండి రాయల్ చాలెంజర్స్ జట్టు విజేతగా మౌంటైన్‌క్రస్ట్ మాన్ట్సర్స్ జట్టు రన్నప్‌గా నిలిచాయి.
నాట్స్ అట్లాంట చాప్టర్ కో ఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది, అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజిని మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు యడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్య కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన, సతీష్ ముసునూరి, శ్రీకాంత్ వల్లభనేని, హరి కరియావుల, శశి ఉప్పల, హితేష్ చింత, రంజిత్ గుజ్జర్లపూడి, స్పోర్ట్స్ టీం నుండి శ్రీనివాస్ ఎడ్లవల్లి, గౌతం రెడ్డి గాదిరెడ్డి తదితరులు పోటీల విజయవంతానికి కృషి చేశారు. పికిల్‌బాల్ టోర్నమెంట్ల నిర్వాహకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని,నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z