తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్ లో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు సాంప్రదాయ పాటలు ఆటలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో వేడుకలు మిన్నంటాయి. అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. టీసీఎస్ఎస్ కార్యవర్గం దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి తదితరులు అతిథులకు బతుకమ్మ శుభాకాంక్షలు అందజేశారు.
TCSS మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల, ముక్కా కిశోర్ తదితరులు వేడుక విజయవంతానికి సహకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z