కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. న్యూజెర్సీలో అయ్యన్నతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని కూటమి నేతలు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా NRIలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తనలాంటి వారిని ఎంతో మందిని తెచ్చారని తనకు కూడా చిన్న వయసులోనే రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అయ్యన్న గుర్తుచేసుకున్నారు. ఏపీలో కూటమికి మద్దతు పలికిన ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రాజ కసుకుర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణ వాసిరెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ కూటమి నేతలు సతీష్ మేకా, నాయుడు ఈర్ల, హరి ముత్యాల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, జగదీష్ యలమంచలి, శ్రీనివాస్ ఓరుగంటి, లక్ష్మి దేవినేని, హరి తుమ్మల, రమణ గన్నే , రవి వట్టికూటి, వంశీ వెనిగండ్ల తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z