NRI-NRT

అమెరికాలో తొలిసారిగా అద్భుతంగా “సత్యహరిశ్చంద్రీయమ్” పద్య నాటకం

అమెరికాలో తొలిసారిగా అద్భుతంగా “సత్యహరిశ్చంద్రీయమ్” పద్య నాటకం

సిలికానాంధ్ర యూనివర్శిటీ వేదికమీద, అమెరికా గడ్డపై తొలిసారిగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం వహించి, హరిశ్చంద్ర పాత్రను నటించి, స్థానిక కళాకారులకు శిక్షణనిచ్చి, డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన “సత్యహరిశ్చంద్రీయమ్” పద్య నాటకం అద్భుతంగా సాగింది. ఈ పద్యనాటకం మధురమైన అనుభూతి మిగిల్చిందని కార్యక్రమంలో పాల్గొన్న కళాప్రియులు పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌కి, రాజు చమర్తికి, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులకు గుమ్మడి గోపాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్టు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గుమ్మడిని సత్కరించారు.

కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అమెరికాలో చేసిన మరో ప్రయోగం సూపర్ హిట్ అయ్యింది! అక్కడి ఔత్సాహిక నటులకు శిక్షణ ఇచ్చి ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర పద్య నాటకానికి తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికారు. వన్స్ మోర్లతో పద్యాలు పాడించుకున్నారు. సిలికానాంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రదర్శన సంచలనం సృష్టించింది. వారణాసి సన్నివేశం నుంచి ప్రారంభించి కాటిసీనుతో నాటకం ఆద్యంతం అలరించింది. స్టాండింగ్ ఓవియేషన్ తో ప్రేక్షకులు పులకించిపోయారు. ప్రధాన హరిశ్చంద్ర పాత్రను గుమ్మడి గోపాలకృష్ణ పోషించి చక్కటి పద్యాలతో మైమరపించారు. మిగిలిన పాత్రాలను పోషించిన నటులు తొలిసారి ఆయా పాత్రల్లో ఒదిగి నాటకాన్ని రక్తి కట్టించారు. అమెరికాలో ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర తొలి ప్రదర్శన సూపర్ హిట్ అయ్యిందని సిలికానాంధ్ర యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చినప్పటికీ మిగిలిన నటులు గొప్ప సహకారం అందించారని, ఆయా పాత్రల్లో చక్కగా రాణించారని దర్శకుడు గుమ్మడి గోపాలకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీతో ఆయా సన్నివేశాలకు అనుగుణంగా చక్కటి దృశ్య కావ్యం లా నాటక ప్రదర్శన జరిగిందని ఆయన తెలిపారు. దినవహి మురళీధర్ సంగీతంతో రక్తి కట్టించారు. అమెరికాలో సత్య హరిశ్చంద్ర నాటకం ఒక సంచలనం అని చెప్పాలి. పద్య నాటక రంగలో గుమ్మడి గోపాలకృష్ణ చెదరని సంచలన చరిత్ర సృష్టించారు. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు, కళా పోషకులు డా. హనిమిరెడ్డి పాల్గొని ఆద్యంతం నాటకం తిలకించి గుమ్మడి గోపాలకృష్ణను అభినందించి ఘనంగా సత్కరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z