NRI-NRT

కాన్సాస్ ప్రవాసుల బతుకమ్మ సంబరాలు

కాన్సాస్ ప్రవాసుల బతుకమ్మ సంబరాలు

కాన్సస్ తెలుగు సంఘం(Telugu Association of Greater Kansas City- TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ప్రవాస మహిళలు ఆడి, పాడి ఆనందించారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి, ప్రసాదం పంపిణీ చేశారు. వేడుక విజయవంతం చేసేందుకు తోడ్పడినవారికి TAGKC అధ్యక్షుడు యక్కలి చంద్ర, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు శివ తియగూరలు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z