ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నాడు తానా ఫౌండేషన్-స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 550 మందికి పైగా పేదలకు ఉచితంగా వైద్యసేవలందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణలో ఇది 8వ వైద్యశిబిరమని ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ తెలిల్పారు. ఈ వైద్యశిబిరానికి డాక్టర్ ప్రసాద్ నల్లూరి ఆర్థిక సహకారమందించారు.
గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న మురికివాడల నుంచి పేదలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మెడికల్ క్యాంప్ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంటుందని, వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారని నిర్వాహకులు తెలిపారు. ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ విభాగాలకు చెందిన్ డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లకు మందులను ఉచితంగా అందించారు. ఈ వైద్యశిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వారికి తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ యెండూరిలు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z