NRI-NRT

లండన్‌లో చేనేత బతుకమ్మ-దసరా వేడుకలు

లండన్‌లో చేనేత బతుకమ్మ-దసరా వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యఅతిధులుగా స్థానిక హౌంస్లౌ మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ-నిర్మల దంపతులు, భారత హై కమీషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్, అజ్మీర్ గ్రేవాల్ మరియు ప్రభాకర్ ఖాజాలు పాల్గొన్నారు. ఉత్తమ 10 బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతిగా అందించారు.

హాజరైన ముఖ్య అతిధులు మాట్లాడుతూ…యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమజాంలో “టాక్” ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు.

భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ యూకేలో యాభై(50) సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టాక్ సంస్థ సన్మానించింది. టాక్ మహిళా నాయకులు క్రాంతి రేతినేని, శ్వేతా మహేందర్, శ్రీవిద్య, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఈవెంట్స్ ఇంచార్జి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం, కమ్మూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ నవీన్ రెడ్డి, నాగరాజు తౌటం, శృతి, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగళి, హరి నవాపేట్, రవి రేతినేని, సుప్రజ పులుసు, గణేష్ కుప్పాల, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, సభ్యులు పవిత్ర కంది , స్వాతి బుడగం, వెంకట్ రెడ్డి దొంతుల, సత్యం కంది, రవిప్రదీప్, మాధవరెడ్డి, సతీష్ రెడ్డి, శశి, తేజ, నిఖిల్, ప్రవీణ్ వీర, రంజిత్, కార్తీక్, శ్రీధర్ రావు, నవ్య, స్నేహ, శైలజ, శ్రీ విద్య, అంజన్ రావు, పృద్వి రావుల , మహేందర్, మౌనిక, శ్రావ్య, ప్రసాద్, అబ్దుల్ జాఫర్, దీపక్, రాజేష్ వాక, నాగరాజు, రమేష్, శ్రవణ్ రెడ్డి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z