కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా నటనలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. జనవరి 27 నుండి ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యే ఈ తరగతుల్లో దూసరి రామాంజనేయులు నటనకు సంబంధించిన పలు కీలకాంశాలపై శిక్షణ ఇస్తారని ఆనంద్ తెలిపారు. నటన, భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, సంభాషణలు, వ్యాకరణం వంటివాటిపై ఈ 15వారాల తరగతుల్లో శిక్షణనిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://uofsa.edu/acting/ వెబ్‌సైట్ చూడవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z