మేషం
ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తే మంచిది.
వృషభం
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మిథునం
మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉంటే మంచిది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
కర్కాటకం
శుభకాలం. బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. దత్తాత్రేయ సందర్శనం శుభదాయకం.
సింహం
చేపట్టే పనిని ఉత్సాహంగా చేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కన్య
ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం పఠించాలి.
తుల
తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరిస్తే శుభప్రదం.
వృశ్చికం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది.
ధనుస్సు
ధర్మ సిద్ధి ఉంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. కీలక వ్యవహారాలను ఇంట్లో వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివిగా ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.
మకరం
శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారా స్తోత్రం పఠించాలి.
కుంభం
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
మీనం
కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z