NRI-NRT

సింగపూర్ ప్రవాసురాలు రాధిక మంగిపూడి ‘విజయనగర వైభవ శతకం’ ఆవిష్కరణ

సింగపూర్ ప్రవాసురాలు రాధిక మంగిపూడి ‘విజయనగర వైభవ శతకం’ ఆవిష్కరణ

‘విజయనగర ఉత్సవ్ 2024’ ప్రారంభోత్సవ సభలో “శ్రీ సాంస్కృతిక కళాసారధి” సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరించబడింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర ంశంఏ శేఋఫ్ ణృఈ సంబంధాల మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం శాసనసభ సభ్యురాలు ఆదితిగజపతి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తదితర ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

రాధిక మంగిపూడి తన స్వస్థలమైన విజయనగరం యొక్క చరిత్ర, వారసత్వము, కళలు, అక్కడ పుట్టిన మహానుభావులు.. ఒక్కొక్క విషయాన్ని గూర్చి ఒక్కొక్క తేటగీతి పద్యాన్ని రూపొందించి 111 పద్యాలతో ఈ ‘విజయనగర వైభవ శతకం’ రచించారు. విజయనగరం జిల్లా వైభవాన్ని కీర్తిస్తూ వెలువడుతున్న తొలి పద్యశతకం ఇది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఆ అమ్మవారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వబడింది. ‘ విజయనగరం సాగి జ్ఞానాంబ మెమోరియల్ బుక్ ట్రస్ట్’ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z