NRI-NRT

నాట్స్ అయోవా విభాగం ప్రారంభం

నాట్స్ అయోవా విభాగం ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అయోవా రాష్ట్రంలో తన విభాగాన్ని ప్రారంభించింది. అయోవా చాప్టర్ సమన్వయకర్తగా శివరామకృష్ణారావు గోపాళం వ్యవహరిస్తారు. కృష్ణ ఆకురాతి, నవీన్ ఇంటూరి, జగదీష్ బాబు బొగ్గరపు, గిరీష్ కంచర్ల, డాక్టర్ విజయ్ గోగినేని, శ్రీని కాట్రగడ్డ తదితర సభ్యులు నాట్స్ అయోవా చాప్టర్‌ సభ్యులుగా సేవలందిస్తారని సంస్థ ఒక ప్రకటన్లో పేర్కొంది.

నాట్స్ అయోవా చాప్టర్ ప్రారంభోత్సవంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ జమ్ముల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెంబర్షిప్ రామకృష్ణ బాలినేని తోపాటు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్ళపాటి, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీస్ లీడర్ అంజయ్య వేలూరు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు, శ్రీ హరీష్ జమ్ముల, రామకృష్ణ బాలినేని, సమన్విత వర్మ, శ్రీనిధి కొంపెల్ల, సుమన్ ఒంటేరు, జయంత్ గద్దె, సురేష్ కావుల, డాక్టర్ సుందర్ మునగాల తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z