ఫ్రాన్స్ దేశంలోని ప్రవాస తెలుగువారు పారిస్ సమీపంలోని మాసీ పలసౌలో ఆదివారం నాడు బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఉల్లాసంగా సాగాయి. సునీత, వైశాలి, శ్రావణి బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు. శృతిక, శ్రీతన్య , శ్రావ్య, హేమంత్ కల్సి దసరా ప్రాముఖ్యాన్ని నాట్యరూపంలో వివరించారు. ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్, రవి బాలబోయిన, గెల్లి హేమంత్, ప్రియాంక పిల్ల, ఉపేంద్ర నాతి, సుధా నారెడ్డి, విక్రమ్ అద్దులగురు, మంచిరెడ్డి విష్ణు, శ్రావణి, సురేష్, శ్రీకాంత్ తదితరుల వేడుక నిర్వహణకు సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z