NRI-NRT

19న డెట్రాయిట్‌లో తానా మహాసభల నిధుల సేకరణ

19న డెట్రాయిట్‌లో తానా మహాసభల నిధుల సేకరణ

2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు డెట్రాయిట్‌లో నిర్వహించనున్న 24వ తానా ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశాన్ని 19వ తేదీన డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్నట్లు సభల సమన్వయకర్త చాపలమడుగు ఉదయకుమార్, ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ సభ్యులు, ప్రవాస ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

* నిరంజన్‌కు చుక్కెదురు
తన ప్రతిపాదన, ప్రమేయాలు లేకుండా తానా 24వ మహాసభల సమన్వయకర్తను నియమించారని లీగల్ నోటీసులు పంపిన తానా అధ్యక్షుడు శృంగవరపు నిరమజన్, శనివారం నాడు జరగనున్న నిధుల సేకరణ సన్నాహక సమావేశాన్ని కూడా నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని బాల్టిమోర్ కోర్టులో దావా వేశారు. గురువారం నాడు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. దీనితో శనివారం సమావేశానికి మార్గం సుగమమైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z