DailyDose

Weekly Horoscope in Telugu – Oct 20-26 2024

Weekly Horoscope in Telugu – Oct 20-26 2024

మేషం
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివారాధన శుభప్రదం.

వృషభం
ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టనివారితో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వృథా ఖర్చులు ముందుకురావచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు చేపడతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మిథునం
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించడం అవసరం. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. వైష్ణవాలయ దర్శనం మేలుచేస్తుంది.

కర్కాటకం
ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గిట్టనివారు పనులు చెడగొట్టడానికి ప్రయత్నించి విఫలమవుతారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. భూ లావాదేవీల్లో ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. భూమి కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

కన్య
ఈ రాశివారికి ఊహించని సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ప్రయోజనం పొందుతారు.

తుల
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం కలిసివస్తుంది. నిత్యం హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం
గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. శివారాధన వల్ల శుభఫలితాలు అధికమవుతాయి.

ధనుస్సు
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మకరం
ఈ వారం గురు సంచారం వల్ల సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది.

కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో అదృష్టం కలిసివస్తుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

మీనం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z