ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఉయ్యూరులోని కెసిపి రోటరీ హాస్పిటల్ సహకారంతో, రైతుకోసం తానా పేరుతో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు పెనమలూరులోని జడ్ పి హస్కూలులో నిర్వహించిన ఈ కంటి వైద్య శిబిరంలో 400 మందికి పరీక్షలను చేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి 7వ తేదీన ఆపరేషన్లు చేస్తామని ఠాగూర్ తెలిపారు. 10వ తేదీన కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. పేద రైతులకు పవర్ స్ప్రేయర్లను, రక్షణ పరికరాలను, మహిళలకు కుట్టు మిషన్లను కూడా ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, రైతుకోసం ఛైర్ రమణ అన్నె, కో చైర్ ప్రసాద్ కొల్లి, పెనమలూరు ఎన్నారై ప్రతినిధులు పాలడుగు సుధీర్, కిలారు ప్రవీణ్, మోర్ల నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z