మేషం
శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే నెరవేరుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
వృషభం
చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. శ్రమ అధికమౌతుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకుసాగాలి. శివ నామాన్ని జపించాలి.
మిథునం
మీదైనా ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.
కర్కాటకం
చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గ ధ్యానం చేస్తే మంచిది.
సింహం
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కన్య
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించాలి.
తుల
అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. దుర్గా దేవి నామాన్ని జపించడం ఉత్తమం.
వృశ్చికం
సమయానుకూలంగా ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. అకారణ కలహ సూచన. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
మకరం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభప్రదం.
మీనం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని జపం చేసుకోవాలి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z