ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి లోకేశ్‌కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షులు కోమటి జయరాం నేతృత్వంలో బే ఏరియా కి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
తన వారం రోజుల పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి లోకేశ్ వివరిస్తారు. భారత కాన్సుల్ జనరల్‌తో 26న భేటీ అవుతారు. ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27న, రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న భేటీ కానున్నారు. 29న అమెజాన్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతోపాటు ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. అదే రోజు లాస్ వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశానికి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఈ నెల 30న వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో నవంబరు 1న సమావేశమవుతారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z