NRI-NRT

విజయవంతమైన ప్రత్తిపాడు ఉచిత మెగా కంటి వైద్యశిబిరం

విజయవంతమైన ప్రత్తిపాడు ఉచిత మెగా కంటి వైద్యశిబిరం

DOSA Foundation, VUYYURU Foundation, FAANG Tech Labల సంయుక్త ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. 300మందికి ఈ శిబిరంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైన 130 మందిని వైద్యులు గుర్తించారు. ఆదివారం నాడు 30మందిని శంకర ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ వారంలో మిగిలిన వారికి కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. నవంబరు 3న బెల్లంకొండలో, 17న ముండ్లమర్రులో ఇదే తరహా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, స్థానికులు వీటిని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z